Kirana Stores: క్విక్ కామర్స్‌కు పోటీగా కిరాణా స్టోర్లకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్

కిరాణా స్టోర్ల కోసం మెరుగైన టెక్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ఎఫ్ఆర్ఏఐ మంగళవారం ప్రభుత్వాన్ని కోరింది.

Update: 2024-12-24 17:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా పెరుగుతున్న క్విక్ కామర్స్ కారణంగా సాంప్రదాయ్ కిరాణా స్టోర్లు నష్టపోతున్నాయని రిటైలర్స్ అసోసియేషన్ ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై ప్రభుత్వానికి కూడా పలు విజ్ఞప్తులు చేసింది. తాజాగా క్విక్ కామర్స్ కంపెనీలతో పోటీపడేందుకు వీలుగా కిరాణా స్టోర్ల కోసం మెరుగైన టెక్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఆర్ఏఐ) మంగళవారం ప్రభుత్వాన్ని కోరింది. 'స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో లాంటి క్విక్-కామర్స్ కంపెనీల వల్ల తమ వ్యాపారాలకు పెరుగుతున్న ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఈ ప్లాట్‌ఫామ్ దోహదపడుతుందని, వాటితో పడేందుకు వీలవుతుందని అభిప్రాయపడింది. ఈ-కామర్స్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలకు పోటీగా తీసుకొచ్చిన ఓఎన్‌డీసీ మాదిరి క్విక్ కామర్స్ స్టోర్ల కోసం రూపొందించాలని ఎఫ్ఆర్ఏఐ ప్రతినిధి అభయ్ రాజ్ మిశ్రా చెప్పారు. 

Tags:    

Similar News