WhatsApp: వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ లాంచ్.. ఇకపై ఆ సమస్యకు చెక్..!
మెటా(Meta)కు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp)ను ప్రపంచవ్యాప్తంగా కొన్ని బిలియన్ల మంది వినియోగిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: మెటా(Meta)కు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp)ను ప్రపంచవ్యాప్తంగా కొన్ని బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. అందులో భాగంగానే యూజర్లకు మెరుగైన ఎక్స్ పీరియెన్స్(Experience) ఇవ్వడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. ఇటీవలే గ్రూప్ కాల్స్ కు సంబంధించి కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చిన ఆ సంస్థ తాజాగా డాక్యుమెంట్లను(Documents) ఈజీగా స్కానింగ్(Scanninhg) చేసే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు వాట్సాప్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబధించిన స్క్రీన్ షాట్(Screen Shot)ను తన బ్లాగ్ పోస్టులో పంచుకుంది.
సాధారణంగా డాక్యుమెంట్లను స్కాన్ చేయాలంటే మనం ఇతర టూల్స్(Tools), అప్లికేషన్(Apps)ల పైనే డిపెండ్(Depend) కావాల్సి వస్తోంది. డాక్యుమెంట్స్ స్కాన్ కోసం మనం ఏదో ఒక థర్డ్ పార్టీ యాప్ లోకి వెళ్లి సైజు(Size), క్వాలిటీ(Quality) చూజ్ చేసుకొని సేవ్ చేసి డాక్యుమెంట్లను రెడీ చేసుకునే సరికి చాలా టైం తీసుకుంటుంది.దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ ఈ సదుపాయం తెచ్చింది. యూజర్లు ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ లోనే షేరింగ్ మెనూలో కొత్తగా 'స్కాన్' ఆప్షన్ ద్వారా కావాల్సిన డాక్యుమెంట్లను ఈజీగా స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసిన తర్వాత డాక్యుమెంట్లను ప్రివ్యూ(Preview) చేసుకునే ఆప్షన్ కూడా ఉందని వాట్సాప్ తెలిపింది. అయితే ఈ ఫీచర్ ను ప్రస్తుతం లేటెస్ట్ వెర్షన్ యాపిల్(Apple) యూజర్లు మాత్రమే యూజ్ చేయొచ్చని, త్వరలోనే ఈ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది.