Tata Capital IPO: వచ్చే ఏడాది ఐపీఓకు రానున్న టాటా క్యాపిటల్..!
టాటా గ్రూప్(Tata Group) 2023లో టాటా టెక్నాలజీస్(Tata Technologies) కంపెనీని ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్(Tata Group) 2023లో టాటా టెక్నాలజీస్(Tata Technologies) కంపెనీని ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు స్టాక్ మార్కెట్లో(Stock Market) విశేషమైన స్పందన లభించడంతో తాజాగా టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీఓకు రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది టాటా క్యాపిటల్(Tata Capital) పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఐపీఓ ద్వారా సుమారు రూ. 17,000 కోట్లను సమీకరించాలని టాటా లక్ష్యంగా పెట్టుకుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాదా ఈ విషయంపై టాటా నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కాగా టాటా టెక్నాలజీస్ కు దేశీయ మార్కెట్లో బంపర్ లిస్టింగ్ లభించడంతో టాటా క్యాపిటల్ ఐపీఓపై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 2022లో టాటా క్యాపిటల్ ను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్(NBFC) సంస్థగా ప్రకటించింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. NBFC గా గుర్తింపు పొందిన కంపెనీలు మూడేళ్ల లోపు కంపల్సరీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి. ఈ ప్రకారం చూసుకుంటే 2025 సెప్టెంబర్ లోపు టాటా క్యాపిటల్ షేర్లు ఈక్విటీ మార్కెట్ లో లిస్ట్ కావాల్సి ఉంది. ఈ మేరకు ఐపీఓకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా టాటా క్యాపిటల్ సంస్థలో టాటా సన్స్(Tata Sons) కు 93 శాతం వాటా ఉంది. 2024 మార్చి 31 నాటికి టాటా క్యాపిటల్ ఆదాయం రూ. 18,178 కోట్లుగా ఉంది.