ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. చాలా ఈజీగా PF డబ్బులు పొందే సదుపాయం
ఉద్యోగులకు భారీ శుభవార్త లభించింది. పీఎఫ్(Provident Fund) డబ్బులు పొందడం ఇక మరింత సులభతరం కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు భారీ శుభవార్త లభించింది. పీఎఫ్(Provident Fund) డబ్బులు పొందడం ఇక మరింత సులభతరం కాబోతోంది. బ్యాంకుల వద్దకు వెళ్లి క్యూ కట్టే పద్దతికి స్వస్తి పలికే రోజులు రాబోతున్నాయి. ఏటీఎం(ATM) కేంద్రాలతో పాటుగా ఫోన్ పే(Phone Pay), గూగుల్ పే(Google Pay) వంటి UPI యాప్స్ ద్వారా కూడా ఈపీఎఫ్ ఖాతాలోని నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు. ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి ఉద్యోగులు పీఎఫ్ మొత్తాలను ఏటీఎం, యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుందని భారీ శుభవార్త చెప్పారు. కేవలం నగదు విత్‌డ్రా మాత్రమే కాకుండా.. పీఎఫ్‌లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చేసుకోవచ్చని చెప్పారు. దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని అభిప్రాయపడ్డారు.