Vivo Y29 5G: దేశీయ మార్కెట్లో వివో నుంచి సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల.. ఫీచర్ డీటెయిల్స్ ఇవే..!
చైనా(China)కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో(Vivo) సరికొత్త ఫోన్ ను తాజాగా విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో(Vivo) సరికొత్త ఫోన్ ను తాజాగా విడుదల చేసింది. వివో వై29 5జీ(Vivo Y29 5G) పేరుతో దీన్ని ఇండియా మార్కెట్(India Market)లో లాంచ్ చేసింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ మొబైల్ ను తీసుకొచ్చింది. 4జీబీ+128జీబీ ధర రూ. 13,999, 6జీబీ+128జీబీ ధర రూ. 15,999, 8జీబీ+128జీబీ ధర రూ. 16,999, 8జీబీ+256జీబీ ధర రూ. 18,999గా కంపెనీ నిర్ణయించింది. డైమండ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, టైటానియం గోల్డ్ కలర్స్ లో ఇది లభిస్తుంది. ప్రారంభ ఆఫర్ కింద రూ. 1,000 క్యాష్ బ్యాక్ అందిస్తున్నామని.. ఎస్బిఐ, IDFC బ్యాంక్, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనేవారికి EMI సదుపాయం, వీ- షీల్డ్ డివైజ్ ప్రొటెక్షన్ కల్పిస్తున్నామని వివో పేర్కొంది.
వివో వై29 5జీ స్పెసిఫికేషన్స్..
- 6.8 ఇంచెస్ HD LCD డిస్ ప్లే+ 1,000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్
- 120Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ OS14
- 6nm ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో రన్ అవుతుంది.
- ఇక బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,500mah బ్యాటరీని అమర్చారు.
- బ్లూటూత్ 5.4, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 3.5 mm ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.