అల్వాల్ లో దారుణం, నడిరోడ్డుపై నెలలు నిండని పిండం…
దిశ, అల్వాల్: అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ అంజనాపురి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. నాలుగు నెలలు నిండిన పిండాన్ని వీధికుక్కలు తీసుకువచ్చి నడి రోడ్డుపై పడేశాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆ పిండాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కలు ఈ పిండాన్ని ఎక్కడ నుంచి తీసుకువచ్చాయి అనే కోణంలో అందుబాటులోనున్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్థానికులు మాత్రం ఇది ప్రైవేట్ ఆస్పత్రుల పనేనని ఆరోపిస్తున్నారు. […]
దిశ, అల్వాల్: అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ అంజనాపురి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. నాలుగు నెలలు నిండిన పిండాన్ని వీధికుక్కలు తీసుకువచ్చి నడి రోడ్డుపై పడేశాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆ పిండాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కలు ఈ పిండాన్ని ఎక్కడ నుంచి తీసుకువచ్చాయి అనే కోణంలో అందుబాటులోనున్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
స్థానికులు మాత్రం ఇది ప్రైవేట్ ఆస్పత్రుల పనేనని ఆరోపిస్తున్నారు. ఎక్కడి నుంచో ఇక్కడికి కుక్కలు తీసుకువచ్చి పడేసే అవకాశం లేదని ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన దారణం తప్ప సుదూరంలో జరిగిన సంఘటన మాత్రం కాదంటున్నారు. ముఖ్యంగా అల్వాల్‌లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు అబార్షన్లు జోరుగా సాగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి సంఘటనకు గల కారణాలను ప్రజలకు తెలిసేలా చూడాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.