రాజపేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

దిశ, యాదగిరిగుట్ట : రాజపేట మండలంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్‌లు చేశారు. పోలీసులు నిన్న నల్లగొండ జిల్లా‌లో జరిగిన బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్ పై దాడికి నిరసనగా సంఘీభావం తెలపడానికి సూర్యాపేట‌కు బయలుదేరిన రాజాపేట మండల బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి నిర్భందించారు స్థానిక పోలీసులు. ఈ సందర్బంగా బీజేపీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల‌పై కపట ప్రేమ చూపిస్తూ నాటకాలు చేస్తుందన్నారు. యావత్ […]

Update: 2021-11-16 02:11 GMT

దిశ, యాదగిరిగుట్ట : రాజపేట మండలంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్‌లు చేశారు. పోలీసులు నిన్న నల్లగొండ జిల్లా‌లో జరిగిన బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్ పై దాడికి నిరసనగా సంఘీభావం తెలపడానికి సూర్యాపేట‌కు బయలుదేరిన రాజాపేట మండల బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి నిర్భందించారు స్థానిక పోలీసులు. ఈ సందర్బంగా బీజేపీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల‌పై కపట ప్రేమ చూపిస్తూ నాటకాలు చేస్తుందన్నారు. యావత్ రాష్ట్రం టీఆర్ఎస్ పాలన‌పై విసుగు చెంది, బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం అవుతుందని ఓర్వలేకే కిరాయి గుండాలతో దాడికి పాల్ప డుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో వరి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదిక సమర్పించి ఇప్పుడు వడ్ల కొనుగోలు విషయంలో మల్లగుల్లాలు పడుతూ కేంద్ర ప్రభుత్వంను తెలంగాణ‌లో దోషిగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ధర్నాల పేరుతో రైతులను రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తుందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ప్రధాన మోడీ‌తో మాట్లాడే ధైర్యం చేయలేక పోతున్నారు, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే దమ్ము లేక‌నే కపట నాటకాలు ఆడుతున్నారని, ఎప్పుడైనా బీజేపీనే రైతుల పక్షాన నిలబడే పార్టీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం‌లో రాజాపేట ఎంపీటీసీ దాచేపల్లి రాజు, గాండ్ల నర్సింగ్ రావు, లక్ష్మణ్, శివరాములు, కిష్టయ్య, ఎర్రగోకుల వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News