పేట్ల బురుజు ఆస్పత్రిలో గర్భిణీ మృతి.. డాక్టర్లే కారణమంటోన్న భర్త

దిశ, చార్మినార్: 7 నెలల గర్భవతి పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన పాతబస్తీలో తీవ్ర కలకలం రేపుతుంది. నార్మల్ డెలీవరి కోసం చివరి వరకు ప్రయత్నించడం కారణంగానే తన భార్య మృతిచెందిందని భర్త ధర్మేష్​ సింగ్​ ఆరోపిస్తూ ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన భార్య మృతి చెందిందని చార్మినార్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది ఇలా ఉంటే పరిస్థితి విషమిస్తుందని ఆపరేషన్​ చేస్తామని చెప్పినా.. భర్త సరైన […]

Update: 2021-08-24 08:58 GMT

దిశ, చార్మినార్: 7 నెలల గర్భవతి పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన పాతబస్తీలో తీవ్ర కలకలం రేపుతుంది. నార్మల్ డెలీవరి కోసం చివరి వరకు ప్రయత్నించడం కారణంగానే తన భార్య మృతిచెందిందని భర్త ధర్మేష్​ సింగ్​ ఆరోపిస్తూ ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన భార్య మృతి చెందిందని చార్మినార్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది ఇలా ఉంటే పరిస్థితి విషమిస్తుందని ఆపరేషన్​ చేస్తామని చెప్పినా.. భర్త సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం కారణంగానే సరితా సింగ్ మృతి చెందిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కాగా, పెండ్లైయిన చాలా ఏండ్లకు బిడ్డ పుట్టబోతున్నాడన్న ఆ కుటుంబానికి.. తల్లికి తోడు కడుపులో బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Tags:    

Similar News