సీఎంకు షాకిచ్చిన ప్రశాంత్ కిషోర్.. పదవికి రాజీనామా

దిశ, తెలంగాణ బ్యూరో: పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ఆ బాధ్యతల నుంచి గురువారం తప్పుకున్నారు. ప్రజాజీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొంత విరామం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రిన్సిపల్ అడ్వైజర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పీకే చెప్పారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. ‘ప్రజా జీవితంలో క్రియాశీల […]

Update: 2021-08-05 05:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ఆ బాధ్యతల నుంచి గురువారం తప్పుకున్నారు. ప్రజాజీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొంత విరామం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రిన్సిపల్ అడ్వైజర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పీకే చెప్పారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు.

‘ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొద్ది రోజులు తాత్కాలిక విరామం తీసుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నట్లు మీకు తెలుసు. అందువల్ల మీ ప్రధాన సలహాదారు బాధ్యతలను నేను చేపట్టలేకపోతున్నా. నా భవిష్యత్‌ కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల ఈ బాధ్యతల నుంచి నన్ను రిలీవ్‌ చేయాలని కోరుతున్నా. మీ సలహాదారుగా నన్ను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు’ అని సీఎంకు రాసిన లేఖలో ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు.

సీఎస్​గారూ.. టైం ఇస్తారా? కోర్టుకు వెళ్లమంటారా?

Tags:    

Similar News