మళ్ళీ కేసులు పెరుగుతున్నాయ్

– జీహెచ్ఎంసీలో కొత్తగా 20 కేసులు దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో ఇకపైన కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కొన్ని రోజుల క్రితం ధీమా వ్యక్తం చేశారు. కానీ జీహెచ్ఎంసీలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కొనసాగుతోంది. ఓ వైపు లాక్‌డౌన్ సడలింపుల కోసం ప్రభుత్వం సంసిద్ధమవుతున్న తరుణంలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో 21 పాజిటివ్ కేసులు […]

Update: 2020-05-03 11:37 GMT

– జీహెచ్ఎంసీలో కొత్తగా 20 కేసులు

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో ఇకపైన కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కొన్ని రోజుల క్రితం ధీమా వ్యక్తం చేశారు. కానీ జీహెచ్ఎంసీలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కొనసాగుతోంది. ఓ వైపు లాక్‌డౌన్ సడలింపుల కోసం ప్రభుత్వం సంసిద్ధమవుతున్న తరుణంలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 20 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా ఒకటి జగిత్యాలలో నమోదైంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,082కు చేరుకుంది. వీరిలో 29 మంది మరణించారు. ప్రస్తుతం 508 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. 545 మంది చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తాజా బులెటిన్ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కంటే డిశ్చార్జి అయిన పేషెంట్లే ఎక్కువగా ఉన్నారు. ఆదివారం ఒక్కరోజే 46 మంది డిశ్చార్జి అయ్యారు.

ఇప్పటివరకు వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మరో 14 జిల్లాల్లోనూ గత రెండు వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఇరవై జిల్లాల్లో కరోనా జాడ లేదు. కేంద్ర లెక్కల ప్రకారం.. తొమ్మిది జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉంటే, మరో 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఇరవై జిల్లాల్లో కేసులు లేనందున త్వరలో గ్రీన్ జోన్ జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

జీహెచ్ఎంసీలో 8 కంటైన్‌మెంట్లు

జీహెచ్ఎంసీ పరిధిలోని వనస్థలిపురం డివిజన్‌లో ఆదివారం కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ఏరియాల్లో ఎనిమిది కంటైన్‌మెంట్ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వనస్థలిపురం పరిధిలోని మూడు కుటుంబాల్లో తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హోం క్వారంటైన్‌లో 169 కుటుంబాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. హుడా సాయినగర్‌, సుష్మాసాయినగర్‌, కమలానగర్‌, రైతుబజార్‌ సమీపంలోని ఎ, బీ టైప్‌ కాలనీలు, ఫేజ్‌-1 కాలనీ, సచివాలయ నగర్‌, ఎస్‌.కె.డి.నగర్‌, రైతుబజార్‌-సాహెబ్‌నగర్‌ రహదారి కంటైన్‌మెంట్ జోన్ల జాబితాలో కొత్తగా చేరాయి.

Tags: Telangana, KCr, corona, Lockdown, Health

Tags:    

Similar News