హుజూరాబాద్‌లో నిలిచేదెవరు?
అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బరిలో బీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దిశ, కరీంనగర్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బరిలో బీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2021 ఉప ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసి ఓటమి చెందిన గెల్లు శ్రీనివాస్‌కు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున బరిలో నిలిచే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. గెల్లు శ్రీనివాస్‌ను తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం రాష్ర్ట వ్యాప్తంగా మరోమారు చర్చకు దారితీసింది. ఇటీవల హుజూరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ఎన్నికల సమయం వరకు ప్రజల మధ్యనే ఉండాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి సూచించడం, ఇప్పుడు గెల్లుకు చైర్మన్ పదవి ఇవ్వడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే 2023 ఎన్నికల్లో ఈటల ప్రత్యర్థి కౌశిక్ రెడ్డినా..? లేక ఈటలకు దీటుగా ఎన్నికల సమయానికి కొత్త వారిని తెరమీదకు తీసుకొస్తారా..? అనేది హాట్ టాఫిక్‌గా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బరిలో బీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2021 ఉప ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసి ఓటమి చెందిన గెల్లు శ్రీనివాస్‌కు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున బరిలో నిలిచే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే గెల్లు శ్రీనివాస్‌ను తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం రాష్ర్ట వ్యాప్తంగా మరోమారు చర్చకు దారితీసింది. ఇటీవల హుజూరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ఎన్నికల సమయం వరకు ప్రజల మధ్యనే ఉండాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి సూచించడం, ఇప్పుడు గెల్లుకు చైర్మన్ పదవి ఇవ్వడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే 2023 ఎన్నికల్లో ఈటల ప్రత్యర్థి కౌశిక్ రెడ్డినా..? లేక ఈటలకు దీటుగా ఎన్నికల సమయానికి కొత్త వ్యక్తిని తెరమీదకు తీసుకువస్తారా..? అనేది హాట్ టాఫిక్‌గా మారింది.
ఉప ఎన్నికలో ఓటమితో అబాసుపాలు..
ఈఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్తి ఎవరనేది ఇప్పుడు రాష్ర్ట వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టున్న ఈటలకు దీటైన అభ్యర్థిని బరిలో నిలిపి 2021 ఉప ఎన్నికల్లో జరిగిన ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భారీ స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. 2021లో ఉత్కంఠగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఉప ఎన్నిక కోసం రాష్ర్టంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను మొత్తం బలగాన్ని మోహరించినప్పటికీ, రూ.కోట్ల డబ్బు కుమ్మరించినా అధికార పార్టీకి ఓటమి తప్పలేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గ్రామగ్రామనా పట్టున్న ఈటల రాజేందర్‌పై తెలంగాణ ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్లో పని చేస్తున్న గెల్లు శ్రీనివాస్‌ను బరిలోకి దింపింది. అంతేకాక ఈటల రాజేందర్, గెల్లు శ్రీనివాస్ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈటలను ఓడించవచ్చు అనే ప్రణాళికతో బీఆర్ఎస్ చేసిన ప్లాన్ తలకిందులైంది. ఆ పార్టీ ప్రతిష్టత్మకంగా తీసుకున్న ఎన్నికలో ఓటమి మూటకట్టుకొని ఆబాసుపాలైయింది.
హుజూరాబాద్‌పై స్పెషల్ పోకస్..
2021 ఉప ఎన్నికలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ పోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. 2021 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచి ఓటమి పాలైన గెల్లు శ్రీనివాస్‌కు మరో మారు అవకాశం కల్పిస్తారని అందరు భావించారు. వచ్చే ఎన్నికల్లో ఈటలపై బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి 2021 ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల హుజూరాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి వచ్చే ఎన్నికల వరకు హుజూరాబాద్ విడిచి వెళ్లొద్దని, ప్రజల మధ్యనే ఉండాలని సూచించారు. బహిరంగ సభలో కేటీఆర్ ప్రకటనతో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి టికెట్ ఖాయం అయినట్లు భావించారు. గడిచిన కొన్ని రోజులుగా కౌశిక్ రెడ్డి సైతం హుజూరాబాద్‌లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం తరుపున వచ్చే పథకాలను నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేస్తున్నాడు.
గెల్లుకు అవకాశం లేనట్లే..
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్న గెల్లు శ్రీనివాస్ అంశం ఇప్పుడు మరోమారు హాట్ టాపిక్‌గా మారింది. గెల్లును తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సీఎం కేసీఆర్ నియమించారు. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో రాష్ర్ట శాసనసభకు ఎన్నికలు జరుగుతాయని అందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్‌కు కార్పొరేషన్ చైర్మన్‌గా పదవి ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ బరిలో గెల్లుకు అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ బరిలో బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డిని నిలుపుతుందా..? లేదా కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకువస్తుందా..? అనేది వేచి చూడాల్సిందే..