దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి.. కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్

తమిళనాడు విద్యుత్ మంత్రి వీ సెంథిల్ బాలాజీపై జరిపిన ఈడీ దాడులపై అక్కడి సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు.

Update: 2023-06-13 13:27 GMT

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు విద్యుత్ మంత్రి వీ సెంథిల్ బాలాజీపై జరిపిన ఈడీ దాడులపై అక్కడి సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. దమ్ముంటే తమను రాజకీయంగా ఎదుర్కోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయన సవాలు విసిరారు. దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష ప్రభుత్వాలను, నేతలను వేధిస్తున్నారని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనికి సంబంధించి దేశంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఓ వైపు తాను దర్యాప్తు సంస్థకు సహకరిస్తానని మంత్రి సెంథిల్ చెప్పినప్పటికీ వినకుండా సెక్రటేరియట్ లోని ఆయన చాంబర్ లో తనిఖీలు నిర్వహించడం దేనికని ప్రశ్నించారు.

ఈడీ అంటే ఎక్కడైనా రైడ్స్ నిర్వహిస్తుందని చెప్పడానికి ఇలా చేశారా అని నిలదీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చిపోయిన గంటల్లోపే ఈడీ దాడులు చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా తమ పార్టీపై.. తమ విధానాలపైన విమర్శలు గుప్పించారని, వాటిని ఖండిస్తూ తాము ప్రతి విమర్శలు చేశామని చెప్పారు. అవి తట్టుకోలేకే బీజేపీ ప్రభుత్వం ఈడీతో దాడులు చేయిస్తోందని సీఎం స్టాలిన్ ఆరోపించారు.

Tags:    

Similar News