Sajjala: సలహాదారుని కొంప ముంచిన సలహా.. సమస్యలు కొనితెచ్చుకున్న సజ్జల

అనాలోచిత మాటలే అన్ని అనర్థాలకు మూలం.

Update: 2024-05-31 07:14 GMT

దిశ వెబ్ డెస్క్: అందుకే మాట్లాడే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అలానే చేసే పనులు కారణంగా శాంతిభద్రతలకు ఆటకం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే నీతి నిజాయతీతో పని చేస్తూ ప్రజలకు ఆధర్శంగా నిలవాలి.

అయితే వైసీపీ కీలక నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం నిజాయితీయా నిమ్మకాయ, అలాంటివి మనకు అవసరంలేదు. మనకి కావాల్సింది అధికారం.. అయితే అధికారం ఎలా వచ్చామన్నది అనవసరం. రూల్స్‌ను కాదనలేక వెనక్కి తగ్గే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దు, మనమేమీ రూల్స్‌ను ఫాలో అయ్యేందుకు అక్కడికి వెళ్లటం లేదు అర్థమైందా అని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు జ్ఞానబోధ చేశారు. దీనితో సలహాదారుడి సలహాలు సూచనలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి.

నిబంధనలు, నియమాలతో పని లేదు..

సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఘటుగా స్పందించారు. రూల్స్‌ను కాదనలేక వెనక్కి తగ్గే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దు, మనమేమీ రూల్స్‌ను ఫాలో అయ్యేందుకు అక్కడికి వెళ్లటం లేదని ఏజెంట్లకు చెప్పడంలో ఆంతర్యం టీడీపీ, జనసేన కౌటింగ్ ఏజెంట్లుమీద తిరగబడేవాళ్లు, వాళ్లతో దెబ్బలాడే వాళ్లుమాత్రమే కౌటింగ్‌కు వెళ్లాలని అని చెప్పడమేగా అని మండిడ్డారు.

ఇటువంటి చట్టవిరోధులని, చట్టాన్ని అతిక్రమించేవాళ్లని ఇమిడియట్‌గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలానే వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల మాట్లాడారని ఆరోపిస్తూ టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ, పార్టీ నేతలతో కలిసి నిన్న తాడేపల్లి సీఐకు ఫిర్యాదు చేశారు. కాగా గుడిపాటి లక్ష్మీనారాయణ, టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు సజ్జలపై ఐపీసీ సెక్షన్ 153,505 (2) IPC, 125 RPA 1951 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

సమస్యలు కొనితెచ్చుకున్న సజ్జల..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తామని, వై నాట్ 175 అని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఒటమి భయం అలానే ఉందని, పార్టీ నేతలను సైతం ఒటమి భయం కలవర పెడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అడ్డదారిలో అధికారాన్ని ఎలా సంపాదించాలి అనే అంశంపై సజ్జల తీవ్రంగా ఆలోచించి కౌంటింగ్ ఏజెంట్లకు కౌంటింగ్ మేనేజ్‌మెంట్ క్లాస్ తీసుకున్నారు.

రూల్స్ రెగ్యులేషన్స్ అని మడికట్టుకు కూర్చుంటే కుదరదని, రూల్స్ బ్రేక్ చేసైనా ఒక్క ఓటు కూడా చేజారకుండా చూసుకోవాలి అని, ప్రత్యర్థులకు ఎలాంటి ఛాన్స్ లేకుండా చేయాలని తెలిపారు. అయితే ఆలోచన లేకుండా అధికారం చేజారుతుందేమో అనే కంగారులో ఏజంట్లను తప్పుదోవ పట్టించేందుకు యత్నించి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు.  


Similar News