కేటీఆర్‌కు మరో BIG షాక్.. బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు మరో అనూహ్య షాక్ తగిలింది.

Update: 2025-01-10 13:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు మరో అనూహ్య షాక్ తగిలింది. శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌(Banjara Hills Police)లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం(ACB Office) నుంచి తెలంగాణ భవన్(Telangana Bhavan) వరకు పోలీసుల అనుమతి లేకుండా లేకుండా ర్యాలీ తీశారని ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

కాగా, ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు గురువారం 6.30 గంటల పాటు విచారించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్‌.. కేటీఆర్‌ను విచారించారు. ఈ విచారణను జాయింట్‌ డైరెక్టర్‌ రితిరాజ్‌ పర్యవేక్షించారు. విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్‌ న్యాయవాది రామచంద్రరావుకు అనుమతించారు. విచారణ అనంతరం కేటీఆర్ మీడియతో మాట్లాడేందుకు ట్రై చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని, ఇక్కడ మీడియా సమావేశం పెట్టవద్దని సూచించారు. పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టుకోవాలన్నారు. దీంతో అక్కడినుంచి ర్యాలీగా తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అయితే, పోలీసుల పర్మిషన్ లేకుండా ర్యాలీ తీయడంపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News