శాసన సభ ముట్టడికి ప్రయత్నించిన న్యాయవాదులు.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత!

తెలంగాణలో శాసన సభ సమావేశాలు జరుగుతున్న వేళ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Update: 2025-03-25 06:56 GMT
శాసన సభ ముట్టడికి ప్రయత్నించిన న్యాయవాదులు.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో శాసన సభ సమావేశాలు (Telangana Assembly Sessions) జరుగుతున్న వేళ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త (High Tension) వాతావరణం నెలకొంది. ఉద్యోగ భద్రత కోరతూ న్యాయవాదులు (Advocates) అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్యపై (Advocate Ijrail Murder) నిరసన తెలియజేసిన న్యాయవాదులు తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ (Telangana Advocates JAC) ఆధ్యర్యంలో శాసన సభను ముట్టించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత లేదని, వెంటనే ఉద్యోగ భద్రత కల్పించేలా చట్టం చేయాలని కోరాతూ.. అసెంబ్లీ వైపు వెళ్లారు.

దీంతో పోలీసులు న్యాయవాదులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి.. ఉద్రిక్తతగా మారింది. అనంతరం పోలీసులు ఆందోళన చేపడుతున్న న్యాయవాదులను అదుపులోకి తీసుకొని అసెంబ్లీ ప్రాంగణం నుంచి తరలించారు. కాగా సోమవారం హైదరాబాద్- సంతోష్‌నగర్ పరిధి న్యూ మారుతీనగర్‌లో అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్య జరిగింది. ఓ మహిళను వేదిస్తున్నాడని ఎలక్ట్రీషియన్ దస్తగిరి అనే వ్యక్తిపై అడ్వకేట్ ఇజ్రాయిల్ ఫిర్యాదు చేశాడు. దీంతో లాయర్ పై కక్ష్య పెంచుకున్న దస్తగిరి ఇజ్రాయిల్ పై కత్తితో దాడి చేశాడు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అడ్వకేట్ ఇజ్రాయిల్ మరణించాడు. 

 

Similar News