అ'భాగ్యనగరం'గా మారిన సౌ'భాగ్యనగరం'.. కేటీఆర్ సంచలన విమర్శలు
అబద్దాలు చెప్పడం కాదు.. అభివృద్ధి చేయడం నేర్చుకోండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: అబద్దాలు చెప్పడం కాదు.. అభివృద్ధి చేయడం నేర్చుకోండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Governement) హైదరాబాద్ నగరం (Hyderabad City)లో చేపడుతున్న కార్యక్రమాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పదేళ్ల కేసీఆర్ పాలన (KCR Governance) లో సౌ'భాగ్యనగరం', 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అ'భాగ్యనగరం' అయ్యిందని కామెంట్ చేశారు. అలాగే హైడ్రా (Hydraa), మూసీ ప్రక్షాళన (Moosi Cleanup) పేరుతో హైదరాబాద్‌లో ఇండ్ల కొనుగోళ్లు తగ్గిపోయాయని, పేదల ఇండ్ల పైకి బుల్డోజర్లు.. పెద్దల ఆస్తులతో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
అంతేగాక రియల్ ఢమాల్.. ఇన్ఫ్రా సజీవ సమాధి అయ్యాయని చెప్పారు. మూసీ, హైడ్రా పేరుతో కాంగ్రెస్ గద్దలు మూటలు కడుతుంటే, అమ్మకాలు జరగక రియల్టర్లు ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. అన్నదాతలే కాదు అమాయక రియల్ వ్యాపారులు (Real Estate Merchants) కూడా ఆత్మహత్యలు (Suicides) చేసుకునే పరిస్థితి! నెలకొన్నదని అన్నారు. హైదరాబాద్‌లో గత త్రైమాసికంలో 49 శాతం ఇళ్ల విక్రయాలు తగ్గాయని, ఆఫీస్ లీజింగ్ (Office Leasing) కూడా అధః పాతాళానికి పడిపోయిందని తెలిపారు. 2025 జనవరి- మార్చి మధ్య 41 శాతం తగ్గుదల ఉందని, కాంగ్రెస్ సర్కార్ దూరదృష్టి లేని, అసమర్థ విధానాలే ఈ పతనానికి కారణమని దుయ్యబట్టారు. ఇక కూల్చడం కాదు.. కట్టడం నేర్చుకోండి అని, అబద్దాలు చెప్పడం కాదు.. అభివృద్ధి చేయడం నేర్చుకోండి అని కేటీఆర్ హితవు పలికారు.