కరాటేలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో మంత్రి పొన్నం ఢీ..!
కరాటేలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ తలపడ్డారు.
దిశ, వెబ్ డెస్క్: కరాటేలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) తో బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తలపడ్డారు. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియం (Gachibouli Stadium)లో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ 2025 (Kio National Karate ChampionShip 2025) ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) సహా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి (Shivasena Reddy) హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జాతీయ కరాటే చాంపియన్ షిప్ నిర్వాహకులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరాటే బ్లాక్ బెల్ట్ (Black Belt) ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురు కరాటేలో తలపడుతున్నట్లుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో కార్యక్రమ వేదికపై సరదా వాతావరణం నెలకొంది. అలాగే మూడు రోజుల పాటు జరగనున్న కియో నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవానికి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (Nikath Jarin) కూడా హాజరవ్వడం విశేషం. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథుల మధ్య తాను కూడా హాజరు కావడం ఆనందంగా ఉందని, రాబోయే మూడు రోజులలో ఛాంపియన్‌షిప్ ఆవిష్కృతమవుతున్నందున పాల్గొనే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.