తప్పు చేస్తే చిప్పకూడు తప్పదా?.. శిక్ష అనుభవించిన సీఎంలు, మాజీ సీఎంలు వీళ్లే!
దేశంలో తప్పులు చేసిన అందరూ శిక్షను అనుభవించడం లేదు. ముఖ్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వారు అధికారాన్ని అడ్డంపెట్టుకొని తప్పించుకుంటున్న ఘటనలు అనేకం చూస్తున్నాం.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో తప్పులు చేసిన అందరూ శిక్షను అనుభవించడం లేదు. ముఖ్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వారు అధికారాన్ని అడ్డంపెట్టుకొని తప్పించుకుంటున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. అధికారం చేతిలో ఉందని అనేక కుంభకోణాలు, స్కామ్‌లకు పాల్పడుతుంటారు. ఇందులో కొందరు వ్యూహాత్మకంగా వ్యవహరించి శిక్ష నుంచి తప్పించుకుంటుండగా.. మరికొందరు తప్పక అనుభవించారు. అందులో సాధారణ వ్యక్తి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల వరకు అందరూ ఉన్నారు. అధికారంలో ఉండి.. అరెస్ట్ అయిన ప్రముఖులు, దేశాన్ని కుదిపేసిన కేసుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జైలు జీవితం గడిపిన ప్రముఖులు :
= లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
= దాణా కేసులో బిహార్ మాజీ సీఎం లాలూ
= భూ కుంభకోణం కేసులో కర్ణాటక మాజీ సీఎం యాడ్యూరప్ప
= అక్రమాస్తులు, కలర్‌టీవీ కుంభకోణంలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత
= స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు
= మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్
= నగదు అక్రమ చెలామణి కేసులో కేంద్ర హోంమంత్రి చిదంబరం