AP Elections 2024: ఏపీలో గెలుపు ఈ పార్టీదే.. తేల్చేసిన మంత్రి ఆర్కే రోజా

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది.

Update: 2024-05-15 06:00 GMT

దిశ వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో అధిక పోలింగ్ శాతం నమోదైంది. దీనితో పోలింగ్​ శాతం పెరిగింది కాబట్టి అదంతా ప్రభుత్య వ్యతిరేక ఓటేనని కూటమి పక్షాలు బలంగా నమ్ముతుంటే.. తాము అందించిన సంక్షేమపథాకాల కారణంగా వైసీపీని గెలిపించేందుకే ఓటర్లు ఓట్లు వేశారని, అదంతా పాజిటివ్​ ఓటింగేనని వైసీపీ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి.

అయితే పోలింగ్ పూర్తికాకముందే వైసీపీ ఓడిపోతుందని మంత్రి ఆర్కే రోజా తేల్చేసిందని విశ్లేషకులు అంటున్నారు. నగరిలో ఆర్కే రోజా ఓటు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైసీపీ నేతలను ధుయ్యబట్టారు. తనకి టీడీపీతో ఏ సమస్య లేదని స్పష్టం చేశారు. అయితే నగరి వైసీపీ నేతలు కే.జే కుమార్‌తోనే తనకి సమస్య అని తేల్చి చెప్పారు.

కే.జే కుమార్‌ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను కలుస్తారని, కాని నగరిలో మాత్రం సైకిల్‌కు ఓటు వెయ్యాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తారని ఆరోపించారు. రాష్రపోస్టులు ఇచ్చినాకూడా వాళ్లు అలా దిగజారిపోవడం చాలా దురద్రుష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ పూర్తికాకముందే తన ఓటమిని తాను ముందుగానే ఒప్పుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కాగా రోజా 2009లోనూ ఇలానే టీడీపీ నేతలను నిందించి టీడీపీని వీడారు. అలానే ఇప్పుడు వైసీపీ నేతలని నిందించారు. దీనితో వైసీపీకి ఓటమి తప్పదనే విషయం రోజాకి అర్థమైందని, అందుకే తాను ఆ పార్టీకి బైబై చెప్పేందుకే తాను అలా మాట్లాడారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాను ఓడిపోయిన ప్రతిసారి సొంత పార్టీ నేతలను నిందించడం తనకి అలవాటేనని, 2009లోనూ ఇలానే టీడీపీ నేతలను నిందించి టీడీపీని వీడారని, ఇప్పుడు కూడా ఆమె వైసీపీని వీడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  


Similar News