CM Jagan: పవన, సౌర ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి భూ సంతర్పణ

నేడు బీజేపీ నేత లంకా దినకర్ విశాఖలో మీడియాతో మాట్లాడారు.

Update: 2024-05-29 10:14 GMT

దిశ వెబ్ డెస్క్: నేడు బీజేపీ నేత లంకా దినకర్ విశాఖలో మీడియాతో మాట్లాడారు.ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో జరిగిన భూదోపిడిపై వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో భూమి రెండు రకాలుగా దోపిడికి గురైందని పైర్కొన్నారు. ఎలా చేశారంటే ప్రాజెక్టుల పేరు చెప్పి, అలానే అమాయకులను వైసీపీ నాయకుల బెదిరించి తక్కువ ధరకు వాళ్ల భూములు కబ్జా చేశారని ఆరోపించారు.

అదీ చాలక పవన, సౌర ప్రాజెక్టుల కోసం 4 లక్షల ఎకరాల దోపిడీకి సిద్దమయ్యారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో షిర్డీసాయి ఎలక్ట్రిల్స్ నుండి వైసీపీ నేతలకి వేల కోట్లు ముట్టినట్టు సమాచారం అందిదని తెలిపారు. 2024లో రాష్ట్రంలో ఏర్పడే నూతన ప్రభుత్వం భూదోపిడీపై విచారించి దోషులను శిక్షించాలని కోరారు. రాయలసీమలోనూ వేల కోట్ల భూముల ధారాదత్తానికి ముఖ్యమంత్రి ఉపక్రమించారని మండిపడ్డారు. జీవోలు, భూములు, సంతర్పణ పత్రులు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ఆగ్రహం వ్యక్తం చేశారు.  


Similar News