Exit polls: ఏపీ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ సిద్దం.. వార్ ఒన్ సైడ్ అంటున్న ప్రముఖ సంస్థలు..?

2024 ఎన్నికల్లో విజయబేరిని మోగించి అధికార పీఠాన్ని అధిరోహించేది ఎవరు..?

Update: 2024-05-30 10:07 GMT

దిశ వెబ్ డెస్క్: 2024 ఎన్నికల్లో విజయబేరిని మోగించి అధికార పీఠాన్ని అధిరోహించేది ఎవరు..?ఓటమిపాలై ఇంటిబాట పట్టేదెవరు..? వైసీపీ అధికారాన్ని చేరాకుండా రాష్ట్రంలో పట్టునిలుపుకుంటుందా..? లేక కూటమి అధికారాన్ని ఒడిసిపట్టుకుంటుందా..? అనే ప్రశ్నలు అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీనేతల్లోనూ ఉత్కంఠ రేపుతున్నాయి.

ప్రచారం నుండి పోలింగ్ వరకు ఎన్నికల బరిలో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అని పోటీపడ్డాయి, కగా పోలింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. అయితే పెరిగిన పోలింగ్ శాతం తమ గెలుపుకు సంకేతం అని ఇరుపార్టీలు ధీమా వ్యక్తం చేశాయి. దీనితో 2024 ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీది అనే అంశంపై స్సష్టత రాలేదు. ఈ నేపథ్యంలో జూన్ 1న సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సిద్దమయ్యాయి.

జూన్ 1తో ముగియనున్న సార్వత్రిక ఎన్నికలు.. ఫలితాల పై ఉత్కంఠ

గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఎవరికి వారు గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. గ్రామీణస్థాయిలో మహిళా ఓట్లు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గ్రామీణస్థాయిలో మహిళా ఓట్లు పెరగడంతో తామే గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే.. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత.. పలు వర్గాల్లో ఉన్నఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందని కూటమి నేతలు పేర్కొంటున్నారు. కాగా జూన్ 1తో సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి. అనంతరం జూన్ 1 వ తేది సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలకానున్నాయి.

ఎగ్జిట్ పోల్స్‌ విడుదలకు సర్వంసిద్దం..

తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది ప్రధాన సర్వే సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ 8 సర్వే సంస్థలు ఇప్పటికే ఏపీ ఎన్నికల ఫలితాలపై ఒక అంచనాకు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఓటరు నాడిదోరకడం లేదని సర్వే సంస్థల ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు 2024 ఏపీ ఎన్నికల ఫలితాలు చాలెంజ్‌గా నిలుస్తున్నాయి.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రతీ ఎన్నికల్లో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు పొందిన ప్రముఖమైన రెండు సంస్థలు మాత్రం ఏపీలో వార్ ఒన సైడ్ గానే జరిగిందనే నిర్దారణకు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.


Similar News