మునుగోడులో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు.. క్లారిటీ ఇచ్చిన Chada Venkat Reddy
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికలో తమ మద్దతు అధికార టీఆర్ఎస్ పార్టీకే ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికలో తమ మద్దతు అధికార టీఆర్ఎస్ పార్టీకే ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదని, అందుకే టీఆర్ఎస్కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మునుగోడులో బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్కే ఉందని తేల్చి చెప్పారు. మునుగోడు బహిరంగ సభకు రావాలని కేసీఆర్ తమను ఆహ్వానించినట్లు తెలిపారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మాణం ఉందని గుర్తుచేశారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పార్టీని ఇబ్బంది పెట్టినట్లు తెలియజేశారు. ఇది మునుగోడు వరకే పరిమితం కాదని, భవిష్యత్‌లోనూ టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.