ప్రధానితో భేటీ అనంతరం MP కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-03-23 10:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే ప్రధానిని కలిసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రోడ్ల విస్తరణ, రైల్వే విస్తరణ పనులపై వినతి పత్రం అందజేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తమ మధ్య రాజకీయ అంశాలు చర్చకు రాలేదని తాను కాంగ్రెస్ పార్టీ ఎంపీనని పార్లమెంట్‌లో ప్రధానితో రాజకీయాలు ఎందుకు మాట్లాడతానన్నారు.

అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిని కాబట్టే ప్రధాని వద్దకు వెళ్లి పలు సమస్యలను ప్రస్తావించినట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలతో పంట నష్టంపై ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు కేంద్రం తరపున ఓ టీమ్‌ను పంపుతామని ప్రధాని చెప్పినట్లు తెలిపారు. టీఎస్ పీఎస్సీ మీద మీడియా అడిగిన ప్రశ్నలకు ఢిల్లీ విషయాలు ఢిల్లీలోనే మాట్లాడతానని పేపల్ లీకేజీ అంశంపై హైదరాబాద్‌లో స్పందిస్తానన్నారు.

Tags:    

Similar News