ఢిల్లీ కొత్త మంత్రులు వీళ్లే!

అవినీతి ఆరోపణలో నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-03-01 06:48 GMT

దిశ, వెబ్ డెస్క్: అవినీతి ఆరోపణలో నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ పదవులు ఎవరిని వరించనున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. అయితే ఆ ఇద్దరి స్థానాల్లో సౌరభ్ భరద్వాజ్, అతిషిలకు మంత్రి పదవులు దక్కించుకోనున్నారని ఆప్ వర్గాలు తెలిపాయి. వీరిద్దరి నియామకానికి సంబంధించిన పత్రాలను ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపించినట్లు సమాచారం. దీంతో కేజ్రీవాల్ కేబినెట్ లో వారిద్దరి ఎంపిక లాంఛనమే అని తెలుస్తోంది.

ఇక ఢిల్లీకి కాబోయే ఈ కొత్త మంత్రుల విషయానికొస్తే.. సౌరభ్ భరద్వాజ్ సౌత్ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆప్ అధికార ప్రతినిధిగా, ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2013-14లో 49 రోజుల పాటు కొనసాగిన ఆప్ ప్రభుత్వం భరద్వాజ్ మంత్రిగా పని చేశారు. ఇక కల్కాజి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఎమ్మెల్యే అతిషి ప్రస్తుతం ఆప్ పొలిటికల్ అఫైర్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. 2015-17 మధ్య కాలంలో అప్పడు మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాకు విద్యా శాఖ సలహాదారుగా పని చేశారు.

Tags:    

Similar News