రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ వాల్ పోస్టర్ల కలకలం
కంటోన్మెంట్ మూడో వార్డు బాలంరాయి పంప్ హౌస్ సమీపంలోని బస్టాప్ వద్ద శుక్రవారం మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ వాల్ పోస్టర్లు వెలిశాయి.
దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: కంటోన్మెంట్ మూడో వార్డు బాలంరాయి పంప్ హౌస్ సమీపంలోని బస్టాప్ వద్ద శుక్రవారం మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ వాల్ పోస్టర్లు వెలిశాయి. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి పార్లమెంట్ పరిధిలో ఎక్కడా కనిపించట్లేదంటూ కంటోన్మెంట్ లో పలు చోట్ల పోస్టర్లు దర్శనమిచ్చాయి. 2020 వర్షాలు, 2023 వర్షాలలో రేవంత్ రెడ్డి ఎక్కడా కనిపించట్లేదంటూ ప్రశ్నార్థకం.. గుర్తుతో ఈ పోస్టర్ల ను బస్టాప్ తో పాటు, పలు చోట్ల గోడలకు గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు. ఇది బీఆర్ఎస్ నేతల పనే అని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.