కర్ణాటక ఎన్నికల్లో 13 మంది మంత్రులు ఓటమి!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాజయం పాలైంది. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది.

Update: 2023-05-13 13:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాజయం పాలైంది. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు కావాల్సి ఉండగా.. ఏకంగా 136 స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నది. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ సైతం ఫలితాలపై స్పందించి, కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

ఇదిలా ఉండగా.. కర్ణాటక ఫలితాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన 13 మంది కీలక నేతలు ఓటమి చెందారు. అంతేగాక, స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే సైతం ఓటమి చెందారు. బెంగళూరు సిటీలోని 18 స్థానాల్లో కేవలం నాలుగు స్థానాలకే బీజేపీ పరిమితమైంది. సిటీలోని అనేక ప్రాంతాల్లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. 2018తో పోలిస్తే అదనంగా కాంగ్రెస్ పార్టీ 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జెండా పాతగా, బీజేపీ 39 స్థానాలు కోల్పోయింది.

ఇవి కూడా చదవండి:

రాహుల్ గాంధీని మహాత్మా గాంధీతో పోల్చిన కమల్ హాసన్  

Tags:    

Similar News