మాస్క్ లేకుంటే జైలుకే..

దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా రెండో వేవ్‌లో మాస్క్‌లు ధరించని వాళ్లు ఇకపై జైలుకు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మాస్క్‌లు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే జీవో నెంబరు 68ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలు, దుకాణాలలో స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రచారం చేస్తున్నారు. జీవో నెంబరు 68 ప్రకారం మాస్క్‌లు ధరించడంతో పాటు దుకాణాలకు వచ్చే వారికి కూడా మాస్కులు […]

Update: 2021-03-30 14:06 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా రెండో వేవ్‌లో మాస్క్‌లు ధరించని వాళ్లు ఇకపై జైలుకు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మాస్క్‌లు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే జీవో నెంబరు 68ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలు, దుకాణాలలో స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రచారం చేస్తున్నారు. జీవో నెంబరు 68 ప్రకారం మాస్క్‌లు ధరించడంతో పాటు దుకాణాలకు వచ్చే వారికి కూడా మాస్కులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకసారి అవగాహన కల్పించిన తర్వాత రెండో సారి కూడా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే దుకాణాదారుల లైసెన్స్‌లను రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

కోర్టులో చార్జిషీటు దాఖలు

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుల్తాన్ బజార్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండ్రోజులు కేసులు బుక్ చేస్తున్నారు. చిక్కడపల్లి పీఎస్ పరిధిలో ఆదివారం 3 కేసులు, సోమవారం 9 కేసులు బుక్ కాగా.. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఒక్కరోజే 20 కేసులు నమోదయ్యాయి. మాస్క్‌లు ధరించని వారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఎవరైతే మాస్క్ లు ధరించకుండా ఉంటారో.. వారి ఫోటోలు తీసుకోవడం, ఆ తర్వాత వారి వివరాలను నోట్ చేసుకుంటున్నారు. పోలీసులు నమోదు చేసిన వివరాలను కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. ఇదే సమయంలో మాస్క్ లేకుండా ఉన్నటువంటి వారి ఫోటోను కూడా కోర్టుకు అందజేయనున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రూ.1000లు జరిమానా కానీ, 6 నెలల వరకూ జైలు శిక్షను కానీ కోర్టు నిర్ణయించే వీలుంది.

కళా ప్రదర్శనలతో అవగాహన

కోవిడ్ మాహమ్మారి నుంచి మనల్నీ మనం కాపాడుకోవడానికి కచ్చితంగా మాస్క్ లు ధరించాలని నగర పోలీసులు విస్తృతంగా వివిధ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా రహదారుల కూడళ్ళ వద్ద వాహనదారులకు మాస్క్ ప్రాధాన్యతను వివరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో, పని ప్రదేశాలలో ప్రభుత్వ జీవో 68 ప్రకారం కచ్చితంగా మాస్క్ ధరించాలని ప్రచారం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కొత్తపేట ప్రాంతంలో ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నాగమల్లు నేతృత్వంలో కరోనా నివారణ పట్ల విభిన్నమైన పద్దతిలో కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పీఎస్ పరిధిలో కేసులు నమోదు చేస్తున్నా.. పంజాగుట్ట, బేగంబజార్, చిక్కడపల్లి, ముషీరాబాద్ ప్రాంతాల్లో ప్రజలకు మాస్క్ లు ధరించడం పట్ల అవగాహన కల్పిస్తున్నారు.

Tags:    

Similar News