పొన్నం ప్రభాకర్ ను అడ్డుకున్న పోలీసులు

దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఐకేపీ సెంటర్ల వద్ద ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పాటు తరుగు పేరిట రైతాంగాన్ని నష్టాల పాలు చేస్తున్నారన్న సమాచారం మేరకు జిల్లాలో శనివారం పొన్నం పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ముస్తాబాద్ వెళ్లిన పొన్నంను పోలీసులు అడ్డుకుని 64 జీవో ప్రకారం ఐకేపీ సెంటర్లకు వెళ్లితే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం పరిష్కరించలేకపోతోందని, […]

Update: 2020-05-16 01:41 GMT

దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఐకేపీ సెంటర్ల వద్ద ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పాటు తరుగు పేరిట రైతాంగాన్ని నష్టాల పాలు చేస్తున్నారన్న సమాచారం మేరకు జిల్లాలో శనివారం పొన్నం పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ముస్తాబాద్ వెళ్లిన పొన్నంను పోలీసులు అడ్డుకుని 64 జీవో ప్రకారం ఐకేపీ సెంటర్లకు వెళ్లితే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం పరిష్కరించలేకపోతోందని, అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న తమను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని పొన్నం ప్రభాకర్ పోలీసులతో వాదించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోన్నదని ఆయన ఆరోపించారు. పోలీసులు ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇలా నిలవరించడం సరికాదన్నారు.

Tags:    

Similar News