దిశ ఎఫెక్ట్.. ఇసుకాసురులపై పోలీసుల డేగకన్ను..
దిశ, నిర్మల్ కల్చరల్ : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుకాసురులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ‘దిశ’ దినపత్రికలో వరుస కథనాలు రావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిఘాపెట్టి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వాహనదారులను మంగళవారం పట్టుకుని కేసు నమోదు చేశారు. గత రెండువారాల క్రితం దిశ పత్రికలో ‘ఇసుకాసురులకు అక్షయపాత్ర’ శీర్షికన కథనాలు రావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగప్రవేశంచేసి ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం రాత్రి సోన్ ఎస్‌ఐ […]
దిశ, నిర్మల్ కల్చరల్ : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుకాసురులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ‘దిశ’ దినపత్రికలో వరుస కథనాలు రావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిఘాపెట్టి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వాహనదారులను మంగళవారం పట్టుకుని కేసు నమోదు చేశారు.
గత రెండువారాల క్రితం దిశ పత్రికలో ‘ఇసుకాసురులకు అక్షయపాత్ర’ శీర్షికన కథనాలు రావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగప్రవేశంచేసి ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం రాత్రి సోన్ ఎస్‌ఐ రవీందర్ ఆధ్వర్యంలో మాదాపూర్ క్రాస్ రోడ్డువద్ద నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వరుస ట్రిప్పులతో స్వర్ణ నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకను కొల్లగొడుతున్నట్లు తెలిపారు. ప్రకృతి వనరులను, భూగర్భ వనరులను నాశనం చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న వ్యక్తులను సహించేది లేదని పేర్కొన్నారు. పట్టుకున్న వాహనాలను సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. సోన్ తహసీల్దార్ అరిఫా సుల్తానా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.