డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే వదిలేది లేదు.. పోలీసుల హెచ్చరిక

దిశ, 8 ఇంకలైన్: డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టరీత్యా నేరమని, మద్యం సేవించి రోడ్డెక్కితే భారీ జరిమానాతో పాటు వెహికిల్ సీజ్ చేస్తామని గోదావరిఖని టూ టౌన్ సీఐ కూచన శ్రీనివాస్ రావు హెచ్చరించారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. వెహికిల్ డాక్యుమెంట్స్ పరిశీలించారు. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ […]

Update: 2021-12-23 09:31 GMT

దిశ, 8 ఇంకలైన్: డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టరీత్యా నేరమని, మద్యం సేవించి రోడ్డెక్కితే భారీ జరిమానాతో పాటు వెహికిల్ సీజ్ చేస్తామని గోదావరిఖని టూ టౌన్ సీఐ కూచన శ్రీనివాస్ రావు హెచ్చరించారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. వెహికిల్ డాక్యుమెంట్స్ పరిశీలించారు. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. సరైన వెహికిల్ డాక్యుమెంట్స్ లేనివారికి, మద్యం సేవించి వాహనం నడిపిన వారికి ఫైన్ వేశారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎక్కువ శాతం ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలన్నారు. ఎన్నో రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించడం మూలంగా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడిన సంఘటనలు ఉన్నాయని, హెల్మెట్ ఆవశ్యకత గుర్తించి ధరించడం అలవర్చుకోవలన్నారు. ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలని, రూల్స్ బ్రేక్ చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్ చెకింగ్‌లో టూ టౌన్ ఎస్సై కళాధర్ రెడ్డి, కమన్‌పూర్ ఎస్సై శ్యామ్ పేటల్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News