మావోయిస్టుల కోసం కార్డన్ సెర్చ్.. వారికి పోలీసుల వార్నింగ్
దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం ముకునూర్ గుత్తికోయ గూడెంలో శనివారం కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మహాదేవపూర్ సీఐ కిరణ్, పలిమెల ఎస్ఐ శ్యామ్ రాజ్, కాటారం సివిల్ సీఆర్పిఎఫ్ పోలీస్, డిస్ట్రిక్ట్ గాడ్ పార్టీ బలగాలతో కలిసి ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో కనిపించిన, సంచరించిన పోలీసులకు వెంటనే సమాచారం […]
దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం ముకునూర్ గుత్తికోయ గూడెంలో శనివారం కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మహాదేవపూర్ సీఐ కిరణ్, పలిమెల ఎస్ఐ శ్యామ్ రాజ్, కాటారం సివిల్ సీఆర్పిఎఫ్ పోలీస్, డిస్ట్రిక్ట్ గాడ్ పార్టీ బలగాలతో కలిసి ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో కనిపించిన, సంచరించిన పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు.
మావోయిస్టు సభ్యులకు ఆశ్రయం కల్పించిన, సహాయం చేసి వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గుత్తి కోయలకు గొడుగులు పంపిణీ చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ముకునూర్ గ్రామంలో చెట్లను నాటారు. పలిమెల మండలంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి, నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు డీఎస్పీ తెలిపారు.