ఎన్నికల వేళ.. బెంగాల్‌లో బాంబుల కలకలం

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో నేడు రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న తరుణంలో బాంబులు కలకలం రేపుతున్నాయి. కేశ్‌పూర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 బాంబులు గుర్తించారు. దీంతో బాంబు స్క్వాడ్ సిబ్బంది ఆ బాంబులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి నిర్వీర్యం చేసింది. అనంతరం కేసు నమోదు చేసుకొని, ఈ బాంబులు ఎవరు పెట్టారు, ఎవరిని హతమార్చడానికి పెట్టారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన నందిగ్రామ్ అసెంబ్లీ […]

Update: 2021-03-31 21:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో నేడు రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న తరుణంలో బాంబులు కలకలం రేపుతున్నాయి. కేశ్‌పూర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 బాంబులు గుర్తించారు. దీంతో బాంబు స్క్వాడ్ సిబ్బంది ఆ బాంబులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి నిర్వీర్యం చేసింది. అనంతరం కేసు నమోదు చేసుకొని, ఈ బాంబులు ఎవరు పెట్టారు, ఎవరిని హతమార్చడానికి పెట్టారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఇవాళే పోలింగ్ జరుగుతోంది. ఇక్కడి నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీలో ఉండగా.. బీజేపీ నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి ఆమెకు గట్టిపోటీ ఇస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరు తలపడుతున్నారు.

Tags:    

Similar News