అత్యాచార నిందితుడికి కరోనా.. భయాందోళనలో ఆ 60 మంది

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ పోలీసులను హడలెత్తిస్తోంది. కరోనా వారియర్స్‌గా పేరున్న వీరిపై కరోనా కాటేస్తూనే ఉంది. ఇలా చాలా చోట్ల విధుల్లో ఉండే పోలీసులు వైరస్ బారీన పడి క్వారంటైన్‌కు వెళ్తున్నారు. వైరస్ కారణంగా ఇటీవల ఓ పోలీస్ స్టేషన్ కూడా మూత పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో పీఎస్ కూడా సీల్ వేశారు. ఓ అత్యాచారం కేసు కారణంగా ఏకంగా 60 మంది పోలీసులు క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో […]

Update: 2020-07-06 10:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ పోలీసులను హడలెత్తిస్తోంది. కరోనా వారియర్స్‌గా పేరున్న వీరిపై కరోనా కాటేస్తూనే ఉంది. ఇలా చాలా చోట్ల విధుల్లో ఉండే పోలీసులు వైరస్ బారీన పడి క్వారంటైన్‌కు వెళ్తున్నారు. వైరస్ కారణంగా ఇటీవల ఓ పోలీస్ స్టేషన్ కూడా మూత పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో పీఎస్ కూడా సీల్ వేశారు. ఓ అత్యాచారం కేసు కారణంగా ఏకంగా 60 మంది పోలీసులు క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటు చేసుకుంది.

ఓ మహిళపై లైంగిక దాడి చేశాడని బిలాస్‌పూర్ సివిల్ లైన్స్ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు మైసూరులో తలదాచుకున్నాడని తెలిసి.. అక్కడికి వెళ్లి మరీ అతడిని తీసుకొచ్చారు. అయితే, వైద్య పరీక్షల్లో భాగంగా అతడికి కరోనా టెస్టులు కూడా చేశారు. పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. అయితే, ఈ కేసులో పాల్గొన్న పోలీసులతో మరో 60 మంది అధికారులు ప్రైమరీ కాంటాక్ట్ అని తేలడంతో అందరినీ క్వారంటైన్‌ తరలించాలని ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆ పోలీస్ స్టేషన్‌ను మూసివేసి కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

Tags:    

Similar News