డిసెంబర్ 22 నుంచి ప్రో కబడ్డీ లీగ్

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన లీగ్స్‌లో ఒకటైన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 8వ సీజన్ డిసెంబర్ 22 నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 కారణంగా గత ఏడాది జరగాల్సిన పీకేఎల్‌ను పూర్తిగా రద్దు చేశారు. మరోవైపు కోవిడ్ పాండమిక్ అనంతరం ఇండియాలో నిర్వహిస్తున్న ఇండోర్ లీగ్ కూడా ఇదే కావడం గమనార్హం. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పీకేఎల్‌ మొత్తం మ్యాచ్‌లను బెంగళూరులోని కంఠీరవ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ముందు జాగ్రత్తగా […]

Update: 2021-10-04 11:47 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన లీగ్స్‌లో ఒకటైన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 8వ సీజన్ డిసెంబర్ 22 నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 కారణంగా గత ఏడాది జరగాల్సిన పీకేఎల్‌ను పూర్తిగా రద్దు చేశారు. మరోవైపు కోవిడ్ పాండమిక్ అనంతరం ఇండియాలో నిర్వహిస్తున్న ఇండోర్ లీగ్ కూడా ఇదే కావడం గమనార్హం. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పీకేఎల్‌ మొత్తం మ్యాచ్‌లను బెంగళూరులోని కంఠీరవ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ముందు జాగ్రత్తగా అహ్మదాబాద్, జైపూర్ వేదికలను కూడా నిర్వాహకులు షార్ట్ లిస్ట్ చేసి పెట్టారు. అన్ని ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు సీజన్ ప్రారంభానికి 14 రోజుల ముందే బెంగళూరు చేరుకోవాలని నిర్వాహకులు సమాచారం అందించారు. జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు అక్టోబర్ 16 నుంచి డెహ్రాడూన్‌లో ప్రీ సీజన్ క్యాంప్ నిర్వహించనున్నది. ఇక తెలుగు టైటాన్స్ జట్టు అక్టోబర్ 7 నుంచి హైదరాబాద్‌లో, బెంగళూరు బుల్స్ తమ సొంత వేదిక వద్ద క్యాంపులు మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News