5G Users: ఆరేళ్లలో దేశీయంగా 97 కోట్లకు 5జీ యూజర్లు

2030 నాటికి 75 శాతం మొబైల్ యూజర్లు 5జీ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తారని నివేదిక అభిప్రాయపడింది.

Update: 2024-11-26 19:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 27 కోట్లకు చేరుకుంటుందని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ప్రజలు నివశించే 95 శాతం ప్రాంతాల్లో 5జీ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చాయని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2030 నాటికి 75 శాతం మొబైల్ యూజర్లు 5జీ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తారని నివేదిక అభిప్రాయపడింది. అంటే దాదాపు 97 కోట్లకు 5జీ కస్టమర్లు పెరగనున్నారు. ఇదే సమయంలో 2030 నాటికి 4జీ సబ్‌స్క్రైబర్లు 24 కోట్లకు తగ్గవచ్చని ఎరిక్సన్ అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో సగటున ఒక స్మార్ట్‌ఫోన్ వినియోగదారు నెలకు 32జీబీ డేటా వాడుతున్నారని, ఇది 2030 నాటికి 66జీబీకి పెరుగుతుంది. 2030 నాటికి గ్లోబల్ డేటా ట్రాఫిక్‌లో 80 శాతం 5జీ నెట్‌వరక్ ద్వారా జరుగుతుందని నివేదిక తెలిపింది. దేశీయంగా కొత్త నెట్‌వర్క్ నుంచి ఆదాయం ఆర్జించేందుకు టెలికాం కంపెనీలు మరింత వేగవంతంగా పనిచేయాలని, 5జీకి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మెరుగైన 5జీ నెట్‌వర్క్ సేవలందించాలని ఎరిక్సన్ నివేదిక పేర్కొంది.  

Tags:    

Similar News