వీడిన మిస్టరీ..కాకతీయ కెనాల్ మృతులది ఆత్మహత్యే

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం ప్రయాణిస్తున్న కారు గత జనవరి నెలలో కనిపించకుండా పోయింది. 20 రోజుల వ్యవధి తర్వాత అది కాకతీయ కెనాల్‌లో కనిపించింది. దానిని క్రేన్ సాయంతో వెలికి తీయగా అప్పటికే అందులో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, అతని భార్య రాధ, కూతురు వినయ శ్రీ మృతి చెందారు. ప్రమాదవ శాత్తు కారు అదుపుతప్పి కెనాల్‌లో పడి ఉంటుందని […]

Update: 2020-06-22 09:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం ప్రయాణిస్తున్న కారు గత జనవరి నెలలో కనిపించకుండా పోయింది. 20 రోజుల వ్యవధి తర్వాత అది కాకతీయ కెనాల్‌లో కనిపించింది. దానిని క్రేన్ సాయంతో వెలికి తీయగా అప్పటికే అందులో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, అతని భార్య రాధ, కూతురు వినయ శ్రీ మృతి చెందారు. ప్రమాదవ శాత్తు కారు అదుపుతప్పి కెనాల్‌లో పడి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన కరీంనగర్ పోలీసులు వారిది యాక్సిడెంటల్ మరణం కాదని..ఆత్మహత్యే అని తేల్చారు. ఎమ్మెల్యే బావ సత్యనారాయణరెడ్డి తిరుమల ఆగ్రో ఏజెన్సీస్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ పేరిట కరీంనగర్‌లో షాపు నిర్వహిస్తున్నాడు. విచారణలో భాగంగా పోలీసులు అందులో తనిఖీలు చేయగా సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో రాసి యున్న మ్యాటర్ ప్రకారం కుటుంబమంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్దారించగా, కారణం మాత్రం వెల్లడించలేదు.

Tags:    

Similar News