షాపింగ్‌కు వెళ్లిన నెమలి.. ఏం చేసిందంటే!
దిశ, హుజూరాబాద్ : హుజురాబాద్ పట్టణ పరిధిలో గల శారద బట్టల దుకాణానికి గురువారం ఓ నెమలి వచ్చింది. షాపులో వస్ర్తాలు ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నెమలి బయటకు రావడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు గానీ, షాపు లోపల గల బట్టల మధ్యలో నెమలి దాక్కుంది. ఒక్కసారిగా నెమలిని చూడటంతో అందులోని సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. శారద బట్టల దుకాణానికి […]
దిశ, హుజూరాబాద్ : హుజురాబాద్ పట్టణ పరిధిలో గల శారద బట్టల దుకాణానికి గురువారం ఓ నెమలి వచ్చింది. షాపులో వస్ర్తాలు ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నెమలి బయటకు రావడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు గానీ, షాపు లోపల గల బట్టల మధ్యలో నెమలి దాక్కుంది. ఒక్కసారిగా నెమలిని చూడటంతో అందులోని సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
శారద బట్టల దుకాణానికి వెళ్లిన అటవీ శాఖ అధికారులు సరిత, రంజితలు నెమలిని తీసుకొని వెళ్లారు. నెమలి ఆరోగ్యాన్ని పరీక్షించిన అనంతరం అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు. అయితే, క్వారీల్లో జరిగే పేలుళ్ల చప్పుళ్లకు భయపడి నెమళ్లు పట్టణాల్లోకి వస్తున్నాయని.. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు అనుమతి లేకుండా నడుస్తున్న క్వారీలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.