ఆ 1400 మంది పరిస్థితి ఏంటి?: టీటీడీకి పవన్ సూటి ప్రశ్న
ఒక్క కలం పోటుతో 1400 మంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించడం అన్యాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అల్పాదాయ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఒక్క కలం పోటుతో వందలమందిని విధుల నుంచి తొలగించడం సరైన పనేనా? అని టీటీడీని ప్రశ్నించారు. ఆ 1400 మంది గత 15 ఏళ్లుగా టీటీడీలో స్వల్ప వేతనాలకు పని చేస్తున్నారని […]
ఒక్క కలం పోటుతో 1400 మంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించడం అన్యాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అల్పాదాయ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఒక్క కలం పోటుతో వందలమందిని విధుల నుంచి తొలగించడం సరైన పనేనా? అని టీటీడీని ప్రశ్నించారు. ఆ 1400 మంది గత 15 ఏళ్లుగా టీటీడీలో స్వల్ప వేతనాలకు పని చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఏ ఒక్క కార్మికుడ్ని కూడా విధుల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన వేళ టీటీడీ చిరుద్యోగులపై ప్రతాపం చూపడం సరికాదని పవర్ స్టార్ సూచించారు. వారి తొలగింపు నిర్ణయాన్ని టీటీడీ పాలకమండలి ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
tags: janasena, pawan kalyan, ttd, twitter