సింగిల్ పంచ్.. విమర్శకుల నోర్లు మూయించిన పవన్
దిశ, వెబ్‌డెస్క్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా పలు పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. మొదట తెలుగు దేశం, ఆ తర్వాత లెఫ్ట్ పార్టీలు, ప్రస్తుతం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు జనసేనాని. అయితే, పవన్ పొత్తులపై పలు రాజకీయ పార్టీలు, నాయకులు విమర్శలు ఎక్కుపెట్టగా.. దీనిపై పవన్ స్పందించారు. తన లక్ష్యం ప్రజా సంక్షేమం.. వారి కోసం ఎంతదూరమైనా వెళ్తా.. ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటా […]
దిశ, వెబ్‌డెస్క్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా పలు పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. మొదట తెలుగు దేశం, ఆ తర్వాత లెఫ్ట్ పార్టీలు, ప్రస్తుతం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు జనసేనాని. అయితే, పవన్ పొత్తులపై పలు రాజకీయ పార్టీలు, నాయకులు విమర్శలు ఎక్కుపెట్టగా.. దీనిపై పవన్ స్పందించారు.
తన లక్ష్యం ప్రజా సంక్షేమం.. వారి కోసం ఎంతదూరమైనా వెళ్తా.. ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటా అని కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా, ఒకపార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలోకి జంప్ చేసే ఎమ్మెల్యేల కంటే తాను చేసేది తప్పుకాదని విమర్శకుల నోర్లు మూయించారు. తన క్యారెక్టర్ విచిత్రంగా ఉంటుందని మాట్లాడే వారికి ఇదే నా సమాధానం అని చెప్పారు. ప్రజాసంక్షేమం కోసం వచ్చే వారితో, పార్టీలను కలుపుకు పోయి పనిచేస్తానన్నారు. తాను పదవులు ఆశించనని స్పష్టంచేశారు.