ఫీజు ఓకే.. వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలి..?
దిశ, ధర్మపురి: ధర్మపురి క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వాహనాల్లో వచ్చేవారి నుంచి పార్కింగ్ ఫీజు కింద రూ. 50 వసూల్ చేస్తున్నారు. కానీ, పార్కింగ్ స్థలం చూపించకపోవడంతో వాహనదారులు అయోమయం అవుతున్నారు. దీంతో వీధుల్లోనే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల కార్లు నిలిపివేయడంతో చిరు వ్యాపారులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా […]
దిశ, ధర్మపురి: ధర్మపురి క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వాహనాల్లో వచ్చేవారి నుంచి పార్కింగ్ ఫీజు కింద రూ. 50 వసూల్ చేస్తున్నారు. కానీ, పార్కింగ్ స్థలం చూపించకపోవడంతో వాహనదారులు అయోమయం అవుతున్నారు. దీంతో వీధుల్లోనే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల కార్లు నిలిపివేయడంతో చిరు వ్యాపారులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.