హీరోయిన్ సెక్స్ టేప్ వీడియో రిలీజ్.. బాయ్‌ఫ్రెండ్ నిర్వాకం
దిశ, సినిమా: అమెరికన్ యాక్ట్రెస్ ప్యారిస్ హిల్టన్ తాజా ఇంటర్వ్యూలో తన జీవితంలో మరిచిపోలేని ఓ సంఘటన గురించి ఓపెన్ అయింది. 2004లో బాయ్ ఫ్రెండ్ రిక్ సలోమన్ సెక్స్ టేప్ విడుదల గురించి మాట్లాడింది. ఈ ఘటన తన లైఫ్‌పై చాలా ప్రభావం చూపించిందని, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందని తెలిపింది. తనకు తెలియకుండా సెక్స్ టేప్ విడుదల చేసి రిక్ నమ్మకద్రోహం చేశాడని బాధపడింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ప్రైవేట్ […]
దిశ, సినిమా: అమెరికన్ యాక్ట్రెస్ ప్యారిస్ హిల్టన్ తాజా ఇంటర్వ్యూలో తన జీవితంలో మరిచిపోలేని ఓ సంఘటన గురించి ఓపెన్ అయింది. 2004లో బాయ్ ఫ్రెండ్ రిక్ సలోమన్ సెక్స్ టేప్ విడుదల గురించి మాట్లాడింది. ఈ ఘటన తన లైఫ్‌పై చాలా ప్రభావం చూపించిందని, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందని తెలిపింది. తనకు తెలియకుండా సెక్స్ టేప్ విడుదల చేసి రిక్ నమ్మకద్రోహం చేశాడని బాధపడింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ప్రైవేట్ ఎక్స్‌పీరియన్స్‌ను అలా ప్రపంచం ముందు బయటపెట్టడం తట్టుకోలేకపోయానని చెప్పింది.
ఒకరిని ప్రేమించినప్పుడు, వారిని చాలా నమ్ముతామని.. కానీ రిక్ అంత దారుణంగా మోసం చేయడం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని, తన మీద తనకే విరక్తి కలిగిందని తెలిపింది. ఆ సెక్స్ టేప్ చూసి ప్రపంచం మొత్తం నవ్విందని, అలాంటి వ్యక్తిని పార్ట్‌నర్‌గా ఎంచుకోవడం బాధ కలిగించిందని తెలిపింది. అందులోనూ తను ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియోలో నటించానని ప్రజలు అనుకోవడం చంపేసినట్లుగా అనిపించిందని తెలిపింది ప్యారిస్ హిల్టన్. ఆ సమయంలో ప్రతీ రోజు ఏడ్చేదాన్నని, ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా చాలాసార్లు ఆలోచించేదాన్నని తెలిపిన ఆమె.. ఆ టైమ్‌లో తన లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అయినట్లుగా పేర్కొంది. ఇప్పటికీ ఆ టేప్ ప్రభావం తన లైఫ్‌పై కచ్చితంగా ఉందని, లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పింది.