ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు రాహుల్ దూరం?.. అందుకేనా?

ఈ నెలాఖరులో ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20, వన్డే సిరీస్‌‌లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది.

Update: 2025-01-09 18:17 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ నెలాఖరులో ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20, వన్డే సిరీస్‌‌లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్‌ టీమిండియాకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. అయితే, ఐసీసీ టోర్నీని దృష్టి పెట్టుకుని పలువురు స్టార్లకు విశ్రాంతినివ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు రెస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ జాబితాలో కేఎల్ రాహుల్ కూడా చేరినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండు సిరీస్‌లకు(వన్డే, టీ20) రాహుల్‌ దూరం కానున్నట్టు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించే జట్టులో అతన్ని వికెట్ కీపర్‌గా చేర్చడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఆ కారణంగానే అతనికి రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరమవడానికి అతను తండ్రి కాబోతుండటం కూడా ఓ కారణం కావొచ్చు. గతేడాది నవంబర్‌లో రాహుల్- అతియ శెట్టి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్టు వెల్లడించారు. బీసీసీఐ అధికారిక ప్రకటన ఇస్తేనే ఇంగ్లాండ్‌‌తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీ జట్టుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Tags:    

Similar News