క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన సాత్విక్ జోడీ.. ప్రణయ్ ఇంటికి
మలేసియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు కుర్రాడు సాత్విక్‌సాయిరాజ్,చిరాగ్ శెట్టి జోడీ జోరు కొనసాగుతోంది.
దిశ, స్పోర్ట్స్ : మలేసియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు కుర్రాడు సాత్విక్‌సాయిరాజ్,చిరాగ్ శెట్టి జోడీ జోరు కొనసాగుతోంది. పురుషుల డబుల్స్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 21-15, 21-15 తేడాతో మలేసియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రియన్ అయూబ్ అజ్రియన్-టాన్ వీ కియోంగ్ ద్వయాన్ని చిత్తు చేసింది. 43 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన భారత జంట రెండు గేముల్లోనే మ్యాచ్‌ను ముగించింది. సాత్విక్ జోడీ విజయం మినహా మిగతా విభాగాల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ హెచ్.ఎస్ ప్రణయ్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. ప్రీక్వార్టర్స్‌లో ప్రణయ్ 8-21, 21-15, 21-23 తేడాతో చైనా ఆటగాడు లి షి ఫెంగ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో యువ క్రీడాకారిణి మాళవని బాన్సోద్ 21-18, 21-11 తేడాతో హాన్ యుయే(చైనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీకి కూడా నిరాశే ఎదురైంది. మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో గాయత్రి జోడీ 21-18, 18-21,19-21 తేడాతో జాంగ్ షుక్సియాన్-జియా యిఫాన్(చైనా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో, కరుణాకరణ్-ఆద్య జంట కూడా రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించాయి.