Team India: టీమిండియా ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకోండి.. జట్టులోకి స్టార్ పేసర్ రీఎంట్రీ!

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy), ఇంగ్లాండ్ (England)తో సిరీస్ సమీపిస్తోన్న తరుణంలో ఆ రెండు టోర్నీలకు బీసీసీఐ మరో మూడు రోజుల్లో జట్లను ప్రకటించనుంది.

Update: 2025-01-09 08:31 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy), ఇంగ్లాండ్ (England)తో సిరీస్ సమీపిస్తోన్న తరుణంలో ఆ రెండు టోర్నీలకు బీసీసీఐ మరో మూడు రోజుల్లో జట్లను ప్రకటించనుంది. ఈ క్రమంలోనే టీమిండియా (Team India) సెలక్టర్లు (Selectors) స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami)పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా, షమీ గాయం నుంచి కోలుకుని దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. జాతీయ జట్టులోకి పునరగమనం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. షమీ చివరగా వన్డే వరల్డ్ కప్‌లో ఆడాడు. అయితే, ఆ టోర్నీలో చీలమండ గాయంతో అతడు లండన్‌ (London) వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సంవత్సరం కాలం తరువాత మళ్లీ కోలుకుని, పూర్తి ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.

ఇటీవల బోర్డర్-గవాస్కర్ (Border-Gavaskar) ట్రోఫీ కోసం మొదట షమీని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించినా.. మోకాలిలో వాపు రావడంతో పక్కన పెట్టారు. అతడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో లేడని బీసీసీఐ మెడికల్ టీమ్ నిర్ధారించడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ (Pakistan) హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy), ఇంగ్లాండ్‌ (England)తో సిరీస్‌కు ఖచ్చింతంగా మహమ్మద్ షమీ (Mohammed Shami)ని సెలక్టర్లు తుది జట్టుకి ఎంపిక చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

 

Tags:    

Similar News