హుజురాబాద్ లక్ష్యంగా ‘స్పెషల్’ ఆపరేషన్.. వారిదే కీలక పాత్ర

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్న హుజురాబాద్ ఎన్నికల్లో కేవలం.. ఎన్నికల ఎత్తుగడలే కాదు మరో కీలకమైన విషయంపై కూడా దృష్టి సారించాయి ప్రధాన పార్టీలు. హుజురాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ రాజీనామా తరువాత టీఆర్ఎస్ మరింత దూకుడు పెంచగా, ఈటల చాప కింద నీరులా తన బలం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వకున్నప్పటికీ హుజురాబాద్‌లో బై పోల్ వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈటల […]

Update: 2021-06-13 22:46 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్న హుజురాబాద్ ఎన్నికల్లో కేవలం.. ఎన్నికల ఎత్తుగడలే కాదు మరో కీలకమైన విషయంపై కూడా దృష్టి సారించాయి ప్రధాన పార్టీలు. హుజురాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ రాజీనామా తరువాత టీఆర్ఎస్ మరింత దూకుడు పెంచగా, ఈటల చాప కింద నీరులా తన బలం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వకున్నప్పటికీ హుజురాబాద్‌లో బై పోల్ వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈటల రాజేందర్ బీజేపీలో చేరే లాంఛనం పూర్తైన తరువాత ఆయన కూడా హుజురాబాద్ కేంద్రీకృతంగానే వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నం కానున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కేవలం ప్రచారాలు, ప్రత్యర్థి ఎత్తుగడలను చిత్తు చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, విమర్శనాస్త్రాలు సంధించుకోవడంతోనే సరిపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సారి ఓ అంశం అత్యంత కీలకంగా మారబోతున్నదన్నది స్పష్టం అవుతోంది.

ఇందుకు ప్రధాన అస్త్రంగా కోవర్టు ఆపరేషన్లను ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాహాటంగా జరిగే అంశాలతో పాటు అంతర్గతంగా జరిగే సమీకరణాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కోవర్టు ఆపరేషన్లకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్‌లో ఈటల వర్గీయులు, ఈటల పంచన టీఆర్ఎస్ వర్గీయులు చేరిపోయారు. అతి నమ్మకం కల్గించినట్టుగా వ్యవహరిస్తూ అక్కడ వేసే వ్యూహాలు ఇక్కడకు, ఇక్కడ జరిగే స్కెచ్‌లు అక్కడకు చేరవేసేందుకు అవసరమైన నెట్ వర్క్‌ను ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వీరంతా స్థానికేతరులైన నాయకుల చుట్టూ చేరి గుట్టు చప్పుడు కాకుండా.. సీక్రెట్ విషయాలను ప్రత్యర్ధికి చేరే వేసే విధంగా పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్నారని గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనివల్ల ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే పరిస్థితి తమకు ఈజీ అవుతుందని ఇరు పార్టీలు సరికొత్త ఎత్తుగడను ఎంచుకున్నాయి. ఇప్పటికే కొంతమంది గురించి నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారంటే కోవర్టు ఆపరేషన్‌పై.. పొలిటికల్ పార్టీలు ఎంత సీరియస్‌గా దృష్టి పెట్టాయో అర్థం చేసుకోవచ్చు. లీకు వీరులకు ప్రత్యేక ప్యాకేజీలు కూడా చేరి ఉంటాయన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఈ కోవర్టు ఆపరేషన్ ఏజెంట్లుగా తయారైన వారిని.. ఏ పార్టీ గుర్తిస్తుందో.. ఎవరు సక్సెస్ అవుతారోనన్నది తేలాలంటే ఫలితాలు వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News