నీలోఫర్ ఆస్పత్రిలో వంద పడకల ఐసీయూ వార్డు ప్రారంభం
దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నీలోఫర్ ఆస్పత్రిలో ఆధునీకరించిన వంద పడకల ఐసీయూను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైసీయా , నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో ప్రభుత్వం ప్రతి పడకకు […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నీలోఫర్ ఆస్పత్రిలో ఆధునీకరించిన వంద పడకల ఐసీయూను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైసీయా , నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రభుత్వమే ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. కరోనా మూడో వేవ్ అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5 వేల పడకలు ఏర్పాటు చేశామన్నారు. దీని కోసం సీఎం రూ. 133 కోట్లు విడుదల చేశారని మంత్రి హరీష్ పేర్కొన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా మొదటి కార్యక్రమంలో నీలోఫర్ ఆసుపత్రిలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. రూ.33 కోట్లతో నీలోఫర్‌లో మరో 800 పడకలు త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. నగరం 4 వైపులా నాలుగు మెడికల్ టవర్ లు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పం అన్నారు. కాగా నీలోఫర్ లో మరో 25 ఐసీయూ పడకలను రూ.1.75 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్, నిర్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.