రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. మృతదేహంతో బంధువుల ఆందోళన

దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం ఏడు గంటలకు రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో మండలంలోని నర్సింహులపల్లి గ్రామానికి చెందిన లచ్చయ్య అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే తీవ్రగాయాలతో చనిపోయాడు. వేరే వాహనంపై ఉన్న కొడిమ్యాలకు చెందిన ఇద్దరిలో ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటనా స్థలంలో మృతదేహాన్ని వారి బంధువులు తీసి వేయకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా మృతుని బంధువులు ఆందోళనకు […]

Update: 2021-12-23 12:46 GMT

దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం ఏడు గంటలకు రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో మండలంలోని నర్సింహులపల్లి గ్రామానికి చెందిన లచ్చయ్య అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే తీవ్రగాయాలతో చనిపోయాడు. వేరే వాహనంపై ఉన్న కొడిమ్యాలకు చెందిన ఇద్దరిలో ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటనా స్థలంలో మృతదేహాన్ని వారి బంధువులు తీసి వేయకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలంలో మృతుని బంధువుల రోదనలు అందరినీ కలచివేశాయి.

పోలీసులతో మృతుని బంధువుల వాగ్వాదం, తోపులాట

మృతదేహాన్ని తొలగించడానికి ప్రయత్నించిన అంబులెన్స్ సిబ్బందితో బంధువులు వాగ్వాదానికి దిగారు. గంటన్నర సేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించడానికి బంధువులు నిరాకరించారు. నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన పోలీసులతో దురుసుగా వ్యవహరించారు. తోపులాటలో మల్యాల ప్రొబేషనరీ ఎస్ఐ కింద పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న మల్యాల సీఐ, ఇద్దరు ఎస్ఐలు గ్రామస్తులు సహాయంతో అతి కష్టం మీద మృతదేహాన్ని జగిత్యాల ఏరియా హాస్పిటల్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Tags:    

Similar News