ఒలింపిక్స్ వాయిదా.. ‘తొందరపాటు చర్య’ : థామస్ బాక్
టోక్యో ఒలింపిక్స్ – 2020ని ఇప్పుడే వాయిదా వేయడమంటే.. అది తొందర పాటు చర్య అవుతుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒలింపిక్స్‌ను నిరాటంకంగా నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఐవోసీకి చెందిన టాస్క్‌ఫోర్స్ ఇచ్చే సూచనల పైనే ఒలింపిక్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని బాక్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒలింపిక్స్ రద్దుచేయడం […]
టోక్యో ఒలింపిక్స్ – 2020ని ఇప్పుడే వాయిదా వేయడమంటే.. అది తొందర పాటు చర్య అవుతుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒలింపిక్స్‌ను నిరాటంకంగా నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఐవోసీకి చెందిన టాస్క్‌ఫోర్స్ ఇచ్చే సూచనల పైనే ఒలింపిక్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని బాక్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ఒలింపిక్స్ రద్దుచేయడం అన్న ప్రశ్నే తలెత్తదని.. ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్‌కు ఇంకా నాలుగున్నర నెలల సమయం ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇతర క్రీడా సంస్థలు తమ టోర్నీలను వాయిదా వేసుకున్న మాట వాస్తవమే అయినా.. ఒలింపిక్స్‌కు ఆ సూత్రం వర్తించదని ఆయన అన్నారు. కోవిడ్ 19 కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై పలు ఆంక్షలు విధించారు. కానీ జులై నాటికి పరిస్థితి అదుపులోనికి వస్తుందని భావిస్తున్నట్లు బాక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags : Olympics, Olympic committee president, Thomas Back, Carona, Postpone