ఆ దెబ్బతో మూలకుపడ్డ టీఆర్ఎస్-బీజేపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు
దిశ, హుజురాబాద్: హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నిక నగారా మోగడంతో నియోజకవర్గంలో వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను అధికారులు తొలగిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుండడంతో ఎన్నికల కమిషన్ చేసిన ఆదేశాలతో నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన దాదాపు రెండు కోట్ల విలువైన ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడ రాతలను స్థానిక అధికారులు తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కాగా కాంగ్రెస్, టీడీపీతో పాటు […]
దిశ, హుజురాబాద్: హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నిక నగారా మోగడంతో నియోజకవర్గంలో వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను అధికారులు తొలగిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుండడంతో ఎన్నికల కమిషన్ చేసిన ఆదేశాలతో నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన దాదాపు రెండు కోట్ల విలువైన ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడ రాతలను స్థానిక అధికారులు తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కాగా కాంగ్రెస్, టీడీపీతో పాటు ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల ప్రచార హోర్డింగులు, బీజేపీ అభ్యర్థి ఈటల ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చాయి. మిగతా పార్టీలు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టు కనిపించలేదు. దీంతో అధికారులు ట్రాక్టర్ల సాయంతో అన్ని పార్టీల ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు.