రైతులపై పోలీస్ కేసులు..!
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఓ అంశం చర్చనీయాంశం అవుతుంది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నా, రాస్తారోకో చేసిన రైతులపై పోలీసులు కేసులు పెట్టారు. గత 50 రోజులుగా మక్కలు, 20 రోజులుగా వడ్లు కొనుగోలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ 3 రోజుల క్రితం నిర్మల్ భైంసా రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. గుండంపల్లి క్రాస్ రోడ్డు వద్ద టెంబుర్ని గ్రామ రైతులు మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేసిన విషయం తెలిసిందే కాగా […]
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఓ అంశం చర్చనీయాంశం అవుతుంది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నా, రాస్తారోకో చేసిన రైతులపై పోలీసులు కేసులు పెట్టారు. గత 50 రోజులుగా మక్కలు, 20 రోజులుగా వడ్లు కొనుగోలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ 3 రోజుల క్రితం నిర్మల్ భైంసా రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. గుండంపల్లి క్రాస్ రోడ్డు వద్ద టెంబుర్ని గ్రామ రైతులు మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేసిన విషయం తెలిసిందే కాగా ఆ రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పరిణామం రైతుల్లో తీవ్ర ఆగ్రహం నింపుతున్నది. ధాన్యం కొనుగోలు చేయమన్నందుకు మాపై కేసులు పెట్టడమేంటని మండిపడుతున్నారు.